09-03-2025 12:35:47 AM
హైదరాబాద్, మార్చి 8: ఫాల్కన్ స్కామ్ లో ఈడీ శనివారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ జెట్ ను సీజ్ చేసింది. ఈ జెట్ “ఫాల్కన్ స్కామ్ ”లో ప్రధాన నిందితుడిగా ఉన్న అమర్‌దీప్ కుమార్‌ది అని ఈడీ అధికారులు తెలిపారు. అమర్‌దీప్ కుమార్, అతడి సహచరుడు ఇదే జెట్‌లో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
కుమార్ ఈ జెట్‌ను రూ. 14 కోట్లు వెచ్చించి 2024 లో కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ‘ఫాల్కన్ గ్రూప్ స్కీమ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లించి ఈ జెట్‌ను కొనుగోలు చేశారు. శంషాబాద్‌లో ల్యాండ్ అయిన తర్వాత జెట్‌ను సీజ్ చేశాం. సిబ్బందిని ప్రశ్నిస్తున్నాం. అంతే కాకుండా వారి వాం గ్మూలం కూడా రికార్డు చేశాం.’
అని పేర్కొన్నారు. జనవరి 22న ఇదే ఫ్లుటైలో దుబాయ్‌కి పారిపోయిన అమర్‌దీప్ మర లా శంషాబాద్‌కు జెట్‌ను పంపాడు. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఈ జెట్ అర్ధరాత్రి శంషాబాద్‌లో ల్యాండ్ కాగా.. ఈడీ అధికారులు సీజ్ చేశారు. అమర్‌దీప్ కుమార్ మీద ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎక్కువ లాభాలు వస్తాయని అమాయకులను నమ్మించి ఫాల్కన్ గ్రూప్ రూ. 1700 కోట్లు వసూలు చేసింది.
డిపాజిట్లను ఇంటర్నేషనల్ కంపెనీల్లో పెట్టుబ డులుగా పెట్టి లాభాలను ప్రజలకు పంచుతామని ప్రచా రం చేసుకుంది. ఇది నమ్మిన ప్రజలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగా.. కీలకసూత్రధారి అమర్‌దీప్ ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బుతో చార్టెడ్ ఫ్లుటై కొనుగో లు చేశాడు. ప్రజలు పోలీసులను ఆశ్రయించడంతో కంపెనీ బాధితులకు రూ. 850 కోట్లు చెల్లిం చి తర్వాత బోర్డు తిప్పేసింది.