calender_icon.png 17 April, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండుగా వీడిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

09-04-2025 01:35:34 AM

తప్పిన పెనుప్రమాదం

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు రెండుగా విడిపోయిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో సికింద్రాబాద్ ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం అనూహ్యంగా రెండు భాగాలుగా విడిపోయింది.

ప్రయా ణం మధ్యలో జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏ ఏసీ బోగి దగ్గర కప్లింగ్ దెబ్బతినడంతో ఇం జిన్ నుంచి మొత్తం 15 బోగీలు విడిపోయా యి. ఈ బోగీలను రెండు ఇంజిన్లతో మంద స రోడ్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ మరమ్మతులు చేశాక రైలు హౌరాకు బయ ల్దేరింది.

ఈ ప్రమాదంతో ప్రయాణికులు సు మారు గంటకు పైగా ఇబ్బందులు పడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు తిరిగి బయల్దేరడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకు న్నారు. అయితే రెగ్యులర్‌గా నడిచే ఓ రైలు నిర్వహణలో లోపాలు ఈ ప్రమాదంతో బయటపడ్డాయి. ప్రమాదంపై రైల్వేశాఖ దర్యాప్తు ప్రారంభించింది.