calender_icon.png 20 April, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విలేకరుల అరెస్టు

20-04-2025 12:00:00 AM

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఎల్బీనగర్, ఏప్రిల్ 19 : షాపులు, వ్యాపార సముదాయాల వద్ద కావాలని గొడవ సృష్టించి, సోషల్ మీడి యాలో చెడుగా ప్రచారం చేస్తామని యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరులను శనివారం సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... సరూర్ నగర్ లోని వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 15లో ఉన్న శ్రీ బాలాజీ మిఠాయి బండార్ వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాం తంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు.

వచ్చినవారు ముందస్తు పథకం ప్రకారం స్వీట్ కొనుకొని తింటూ కొద్ది సమయానికి స్వీట్‌లో ఒక ఎండిన రొయ్యను చూపించి వాంతులు చేసుకున్నట్లుగా నటించారు. షాప్‌లోని స్వీట్‌లో తినడంతోనే వాంతులైనట్లు గొడవ సృష్టిం చారు. ఇద్దరు వ్యక్తులు షాప్ యాజమానితో మాట్లాడుతూ మీము విలేకరుల మని, ఇక్కడ జరిగిన గొడవను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని షాప్ యజ మానిని బెదిరించారు.వీరిపై అనుమానం వచ్చిన స్వీట్ షాప్ యాజ మాన్యం సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. సరూర్ నగర్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరు వ్యక్తులను వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. చిర్రా కోటేశ్, వడ్లకొండ నరేశ్ అనే ఇద్దరు RE5 యూట్యూబ్ చానెల్ పేరుతో ప్రెస్ కార్డు పెట్టుకొని బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లుగా గుర్తించారు. స్వీట్ షాప్ ల్లో స్వీట్ తింటూ కొద్ది సమయానికి పథకం ప్రకారం వెంట తెచ్చు కున్న ఎండు రొయ్యను స్వీట్‌లో పెట్టి, వాంతులు చేసుకుని తమ ఆరోగ్యం పాడైయిందని, యాజమానులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీరిద్దరూ ఇతర ప్రాంతాల్లో ఇలాగే చేసి, డబ్బులు వసూలు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి వివరించారు.