calender_icon.png 22 September, 2024 | 6:02 AM

జగిత్యాలలో ఫేక్ పేమెంట్ మోసం

15-07-2024 01:59:10 AM

జగిత్యాల, జూలై 14 (విజయక్రాంతి): ఫేక్‌పేమెంట్‌పై బాధితురాలు జగిత్యాల పట్ట ణ పోలీసులను ఆశ్రయించింది. పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఓ వస్త్ర దుకాణానికి ఇటీవల మెజెంటా రంగు టీషర్ట్, బ్లూ టీషర్ట్ ధరించి ఓ యువకుడు వచ్చాడు. మూడు చీరెలు కొన్నాడు. ఆ బిల్లుతో పాటు తనకు మరో రూ.10 వేల నగదు కావాలని.. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లిస్తానని దుకాణ యజమానురాలికి చెప్పాడు. ఆమె అందుకు అంగీకరించగా, యువకుడు పేమెంట్ చేస్తున్నట్లు నటించాడు. తర్వాత పేమెంట్ కావ డం లేదని.. మరో ఫోన్ నంబర్ చెప్పాలని కోరాడు. దీంతో యజమానురాలు ఆమె బంధువు నంబర్ చెప్పింది.

వెంటనే రూ.10 వేలు ఫోన్ పే చేసినట్లు యువకుడు ఫేక్ మెసేజ్ పంపించాడు. అనంతరం యజమానురాలి నుంచి రూ.10 వేలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. బంధు వు ఖాతాలో నగ దు జమ కాలేదని గుర్తించిన బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయిం చింది. నిందితుడు నంబర్ ప్లేట్ లేకుండా బైక్‌పై దుకాణానికి వచ్చిన సీసీ ఫుటేజీని గుర్తించారు. అతడి చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. అనుమానాస్ప వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు డయల్ 100కు కాల్ చేయాలని సీఐ విజ్ఞప్తి చేశారు.