calender_icon.png 21 January, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధారిలో నకిలీ నోట్ల చెలామణి!

21-01-2025 12:22:38 AM

దేవుడి హుండీలో లభ్యమైన నోట్లు 

కామారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మరోసారి నకిలీనోట్ల కలకలం వెలుగుచూసింది. గతంలో బిచ్కుందకు చెందిన ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నకిలీనోట్లు చెలామణి చేయగా.. జిల్లా పోలీసులు ఆ ముఠాలో కొందరిని అరెస్ట్ చేసి, రూ.59 లక్షల నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్న విషయం విధితమే.

ఇటీవల కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్‌తండాలో లక్ష్మమ్మ ఆలయ ఉత్సవాలను సంక్రాంతికి నిర్వహించారు. హుండీల్లో వచ్చిన విరాళాల్లో నకిలీనోట్లు వెలుగుచూశాయి. ఈ విష  పోలీసులకు తెలియడంతో నకిలీనోట్ల చెలామణిలో ఎవరి హస్తం ఉందనే కొణం  విచారణ జరుపుతున్నారు.

తండాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి నకిలీ నోట్ల చెలామణి  వ్యవహారంలో హస్తం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే తండాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ  చేపడుతున్నారు.