calender_icon.png 10 January, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.11.32 కోట్ల విలువైన నకిలీ ఔషధాల పట్టివేత

31-12-2024 02:38:18 AM

  1. 14 డ్రగ్ రాకెట్ ముఠాల గుట్టురట్టు 
  2. అనుమతుల్లేకుండా మెడిసిన్ తయారు చేస్తున్న 28 సంస్థలపై కేసులు
  3. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ విభాగం వార్షిక నివేదికలో వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాం తి): ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 11.32 కోట్ల విలువైన నకిలీ ఔషధాలను పట్టుకున్నట్లు రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ విభాగం వెల్ల డించింది. సోమవారం ఈ మేరకు వార్షిక నివేదిక వెల్లడించింది. 12 నెలల్లో మొత్తం 3,902 డ్రగ్ నమూనాలు సేకరించామని, వాటిలో 130 డ్రగ్స్ ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం లేవని పేర్కొన్నది.

గతేడాది ప్రమాణాలు లేని డ్రగ్స్ సంఖ్య 79 తేలిందని, 2018లో ఈ సంఖ్య 38 ఉండేదని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25,253 చోట్ల దాడులు నిర్వహించి, 4,102 కేసులు నమోదు చేశామని ప్రకటించింది. 14 డ్రగ్ రాకెట్ ముఠాల గుట్టురట్టు చేశామని వివరించింది. అలాగే 24 నార్కోటిక్ డ్రగ్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నది.

లైసెన్స్ లేకుండగా ఔషధాలు తయారు చేస్తున్న 28 సంస్థలపై కేసులు నమోదు చేశామన్నది. అలాగే ఎలాంటి అనుమతి లేకుండా మెడిసిన్ విక్రయిస్తున్న 90 మంది ఆర్‌ఎంపీలపె కేసులు పెట్టామని స్పష్టం చేసింది. నకిలీ లేదా కాలం చెల్లిన ఔషధాలను విక్రయించే వారిపై 18005996969 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది.