calender_icon.png 18 April, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండలో నకిలీ మద్యం గుట్టురట్టు

03-04-2025 12:00:00 AM

భారీగా స్పిరిట్ స్వాధీనం 

నల్లగొండ, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలో ఏండ్లుగా సాగుతున్న కల్తీ మద్యం దందా గుట్టురట్టయ్యింది.  చండూ రు, కనగల్, గుర్రంపోడు, నాంపల్లి మండ లాల్లో మంగళవారం రాత్రి ఎస్‌ఓటీ, టాస్క్ఫో ర్స్ పోలీసులు దాడులు జరిపిన కల్తీ మద్యం తయారీకి వినియోగించే స్పిరిట్ను భారీగా స్వాధీనం చేసుకున్నారు.

చండూరుకు ఎర్రజెళ్ల రమేశ్, కనగల్ మండలం యడవల్లి గ్రామానికి చెందిన భార్గవ్, నాంపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కొంతకాలంగా కల్తీ మద్యం దందా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. దాడుల్లో భార్గవ్ ఇంటి వద్ద 20 లీటర్లు, రమేశ్ ఇంటి వద్ద 60 లీటర్ల స్పిరిట్, చండూరు, గుర్రంపోడు మండలాల సరిహద్దులో రమేశ్కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో1500 లీటర్ల నకిలీ మద్యం నిల్వలు గుర్తించారు. ఈ రెండెకరాల వ్యవసాయ క్షేత్రం చుట్టూ కంచె, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దందా నాలుగేండ్ల నుంచి కొనసాగుతున్నట్లు తెలిసింది. దందాలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు సమాచారం.