calender_icon.png 13 February, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెక్రటేరియేట్‌లో నకిలీ ఐఏఎస్!

13-02-2025 01:19:32 AM

నకిలీ ఐడీ కార్డుల తయారీలో ఉద్యోగుల ప్రమేయం?

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): నకిలీ ఐఏఎస్ ఐడీ కార్డుతో సెక్రటేరియేట్‌లోకి ప్రవేశించబోయి బుధవారం ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బాలకృష్ణ ఐఏ ఎస్ పేరిట తయారు చేసుకున్న నకిలీ ఐడీ కార్డుతో ఓ వ్యక్తి సచివాలయంలోకి వెళ్తుండగా ఎస్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. సెక్రటేరియట్ సీఎస్వో దేవీదాస్ ఆదేశాలతో ఎస్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమై బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.

జీఏడీ వ్యవహారాలు చూస్తానంటూ సదరు వ్యక్తి పలువురు ప్రజలను మోసం చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. సెక్రటరీ పేరుతో ఉద్యోగాల ఆర్డర్ కాపీలను తయారు చేసి బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ నకిలీ ఐడీ కార్డుల తయారీలో పలువురు సెక్రటేరియేట్ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తూ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు సమాచారం.