calender_icon.png 25 September, 2024 | 10:02 AM

10,700 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు

25-09-2024 12:00:00 AM

రూ.10 వేల కోట్ల ఎగవేత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ ౨4: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం కింద10,700 సంస్థలు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకుని, రూ.10,179 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని సెం ట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) సభ్యుడు శశాంక్ ప్రియ చెప్పారు.

మంగళవారం అసోచామ్ సదస్సులో శశాంక్ మాట్లా డుతూ నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు ఫిజికల్ వెరిఫికేషన్లు  చేపడుతున్నామని, దేశవ్యాప్తం గా ఇందుకు సంబంధించిన రెండో డ్రైవ్ ఆగస్టు 16 ప్రారంభించామని, అక్టోబర్ 15 వరకూ కొనసాగుతుందన్నారు.

ఈ డ్రైవ్‌లో సెప్టెంబర్ 22 వరకూ 10,700 బోగస్ రిజిస్ట్రేషన్లను జీఎస్టీ అధికారులు కనుగొ న్నారని, ఈ సంస్థలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను చట్టవిరుద్ధంగా పొంది ఖజానాకు రూ.10,179 కోట్ల నష్టం తీసుకొచ్చారని వివరించారు.