calender_icon.png 18 January, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యుడి బాగోతం బట్టబయలు

18-01-2025 01:05:20 AM

* దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

కామారెడ్డి, జనవరి 17 (విజయక్రాంతి): ప్రభుత్వ వైద్యుడినని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ వైద్యుడికి ఆర్‌ఎంపీ, పీఎంపీలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లిలో ఉన్న ప్రభుత్వ బస్తీ దవాఖానాలో బాలకృష్ణ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

ఎల్లారెడ్డి, లింగంపేట్ మండల కేంద్రాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల వద్దకు వెళ్లి జిల్లా వైద్యాధికారి పంపించారంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిలో ఇద్దరు ఆర్‌ఎంపీ, పీఎంపీల నుంచి కూడా రూ.15 వేలు వసూలు చేశాడు. శుక్రవారం లింగంపేటలో ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి రూ.20 వేలు డిమాం డ్ చేశాడు. అతడు రూ.10 వేలు ముట్టుజెప్పాడు. అయితే కొద్దిసేపటికి అనుమానం రావడంతో బాలకృష్ణను నిలదీశారు.

పొంత న లేని సమాధానాలు చెప్పడంతో నకిలీ వైద్యుడిగా నిర్ధారించుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలకృష్ణపై డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేసినట్లు లింగంపేట మెడికల్ ఆఫీసర్ హిమ బిందు తెలుపగా, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో తెలిపారు.