సిరిసిల్ల, నవంబర్ 25 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లాలో సోమ వారం టీజీఎంసీ బృందం ఆసుపత్రులపై దాడులు నిర్వహించి, పలువురిపై కేసులు నమోదు చేసిం ది. సిరిసిల్ల పట్టణం గోపాల్‌రావునగర్‌లోని బాబా క్లినిక్, ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముక్తార్ హాస్పిటల్, వేములవాడ గాంధీనగర్‌లోని అశ్విన్ క్లినిక్‌లో తనిఖీలు నిర్వహించారు.
అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నట్టు గుర్తించి నిర్వాహకులు బెజ్జంకి రవీందర్, ముక్తర్, మాదాస్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో వందల సంఖ్యలో యాంటిబయాటిక్స్ ఇంజక్షన్లతో పాటు స్టెరాయిడ్స్ లభించాయి.