మద్యం సీసాలపై డిఫెన్స్ ముద్ర
నిషా కోసం ఆల్కాహాల్ శాతం పెంచి అమ్మకం
సంగారెడ్డి, ఆగస్టు 26 (విజయక్రాంతి): కర్ణాటకలోని బీదర్ కేంద్రంగా నకిలీ డిఫెన్స్ మద్యం జోరుగా హైదరాబాద్‌కు తరలిస్తు న్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. బీదర్ పట్టణంలో ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రం ఉండటంతో డిఫెన్స్ మద్యం ఎక్కువగా అమ్మకాలు చేస్తారు. కొందరు స్మగ్లర్లు డిఫెన్స్ ఖాళీ సీసాలు తీసుకుని నకిలీ మ ద్యం నింపి హైదరాబాద్‌కు తరలిస్తూ అమ్ముతున్నారు. నిషా కోసం నకిలీ మద్యం లో ఆల్కాహాల్ శాతం పెంచుతున్నారు. నకిలీ మద్యం సీసాలకు అచ్చం డిఫెన్స్ ముద్రలను అతికిస్తారు.
ముందుగా ఏర్పా టు చేసుకున్న ముఠా ద్వారా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, హైదరాబాద్‌కు బీ దర్ నుంచి రోడ్డు, రైలు మార్గం ద్వారా తరలిస్తున్నారని సమాచారం. బీదర్ పట్టణానికి రాష్ట్ర సరిహద్దులో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం ఉంది. న్యాల్‌కల్ మండ లం జహీరాబాద్ డివిజన్‌లో ఉండగా ఎక్సై జ్ పోలీ సు స్టేషన్‌ను నారాయణఖేడ్ డివిజన్‌లో ఏర్పాటు చేశారు. బీదర్ రోడ్డు నుంచి నారాయణఖేడ్‌కు 60 కిల్లోమీటర్లు ఉంటుంది. దీంతో ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు చేయడం లేదు. రాష్ట్ర సరిహద్దులోనూ ఎక్సైజ్ చెక్‌పోస్టు లేదు.
దీంతో స్మగ్లర్లు ప్రతి రోజు నకిలీ మద్యంను హై దరాబాద్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్సైజ్ అధికారులకు స్మగ్లర్లు ప్రతి నెల మామూళ్లు ఇవ్వడం తోనే తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలొస్తున్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే దాడులు చేసి కేసులు పెడుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 22న స్మగ్లర్లు బీదర్ నుంచి హైదరాబాద్‌కు కారులో రూ.7.30 లక్షల నకిలీ డిఫెన్స్ మద్యం బాటిళ్లను తరలిస్తుండగా జహీరాబాద్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.