calender_icon.png 4 April, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

13-12-2024 12:24:36 AM

  1. బిచ్కుంద కేంద్రంగా కార్యకలాపాలు
  2. రూ.50 లక్షల నోట్లు పట్టివేత
  3. వాహనం, మెషిన్ స్వాధీనం
  4. పలువురి అరెస్ట్.. పకడ్బందీగా విచారణ

కామారెడ్డి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్ల తయారీ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.50 లక్షల నకిలీ నోట్లను వాహనంలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.

ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేర కు మూడు రోజుల క్రితమే ముఠాను పట్టుకున్నారని, సీక్రెట్‌గా నిందితులను విచారి స్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద కేంద్రంగా నకిలీ నోట్ల ముఠా  కార్యకలపాలు కొనసాగిస్తున్నది. ప్రింటింగ్ కు మెషినరీ ఏర్పాటు చేసుకొని  కొంత కాలంగా నకిలీ నోట్లను ముద్రిస్తున్నది.

గుట్టుచప్పుడు కాకుండా చలామణి చేస్తున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ముఠాపై ప్రత్యేక దృష్టి సారించా రు. మూడు రోజుల క్రితం బిచ్చుందలోని నకిలీ నోట్ల ముఠా స్థావరాల్లో టాస్క్‌ఫోర్స్ ద్వారా దాడులు నిర్వహించారు. నోట్లు రవా ణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ మెషిన్‌తో పాటు ముఠాలోని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ముఠా కార్యకలాపాలు కేవలం జిల్లా వరకే పరిమతమయ్యాయా? నకిలీ నోట్ల చలామా ణి ఇతర జిల్లాలు లేదా ఇతర రాష్ట్రాలకూ చలామణి అయ్యాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ నోట్ల తయారీ ముఠా వెనుక సూత్రధారులు ఎవ రు? పాత్రధారులు ఎవరు అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.