calender_icon.png 23 December, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

03-08-2024 04:30:44 PM

మెట్పల్లి : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత సంవత్సర కాలంగా హైదరాబాదులో ముగ్గురిని, ధర్మపురి, కరీంనగర్, జన్నారం జగిత్యాలలో ఒక్కొక్కరిని దాదాపుగా పది లక్షల రూపాయల వరకు మోసం చేసిన ఆరుగురిని మెట్పల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తక్కువ ఒరిజినల్ నోట్లకు పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు ఇస్తానని ఆశ చూపి ఇద్దరు నోట్లు లెక్కిస్తుండగా మరో ఇద్దరు పోలీస్.. పోలీస్ అని అరుస్తారని, వచ్చిన వ్యక్తి పారిపోయే విధంగా చేసి దండిగా డబ్బులు సంపాదిస్తున్న, జగిత్యాలకు చెందిన సదల సంజీవ్, బిట్టు శివకుమార్ మగ్గిడి కిషన్, కలకుంట్ల గంగారం బొంగురాల మల్లయ్య మాణిక్య అశోక్ అనే వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 14 కట్టల 500 రూపాయల నోట్లు అలాగే ఆరు సెల్ ఫోన్లు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు తెలిపారు. మెట్పల్లి శివారులోని పెద్ద గుండు వద్ద రాజేందర్ అనే వ్యక్తి వద్ద ఈనెల ఒకటో తేదీ రోజు లక్ష రూపాయల తీసుకుని మోసం చేయడంతో అతని ఫిర్యాదు మేరకు రెండో తేదీన వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.