calender_icon.png 20 April, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

150 బస్తాల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

21-03-2025 01:46:15 AM

మేడ్చల్, మార్చి 20(విజయ క్రాంతి): కర్ణాటక నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల నకిలీ పత్తి విత్తనాలను మేడ్చల్ ఎస్‌ఓటి, షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక నుంచి డీసీఎం వ్యాన్ లో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద నిఘా వేశారు. డీసీఎం వ్యాన్ లో తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన సురేష్ అనే వ్యక్తి కర్ణాటకలో రమణ అనే వ్యక్తి వద్ద నుంచి నకిలీ కొత్త విత్తనాలు కొనుగోలు చేసి తరలిస్తున్నట్టు పోలీసు విచారణ తేలింది. 3 750 కిలోల పత్తి విత్తనాలు సుమారు 4000 ఎకరాల్లో విత్తడం వల్ల పర్యావరణానికి హాని కలిగేది.

పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఉద్దేశంతోటే బిటి 3 రకం పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. వీటి విలు వ సుమారు రూ.90 లక్షలు ఉంటుంది. వ్యాను డ్రైవర్ ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. నకిలీ విత్తనాలను పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు. గంజాయి, మత్తు పదార్థాలు, నకిలీ విత్తనాలపై గట్టి నిఘా వేశామని, వీటిని ఎవరు తరలించిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విలేకర్ల సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, ఎస్ ఓ టి ఏ సి పి శ్రీనివాస్, అడిషనల్ ఏసిపి శివప్రసాద్, షామీర్పేట్ సిఐ శ్రీనాథ్, ఎస్త్స్రలు మురళి, పాల్గొన్నారు.