calender_icon.png 12 January, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ సిగరెట్ల రాకెట్ గుట్టురట్టు

12-01-2025 01:02:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11 (విజయక్రాంతి): నగరంలో ఫేక్ గోల్డ్‌ఫ్లాక్ సిగరెట్ల రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం బేగంబజార్‌లోని ఓ కిరాణ జనరల్‌స్టోర్‌పై దాడులు జరిపిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.11.22 లక్షల విలువ చేసే 6,600 ఫేక్ గోల్డ్‌ఫ్లాక్ సిగరెట్ ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్థాన్‌కు చెందిన కమల్ కిషోర్ (50) ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరంలోని బేగంబజార్‌లో నివాసం ఉంటూ శ్రీరామ్ ఆగ్రాస్ పేరుతో కిరాణా జనరల్ స్టోర్‌ను నడుపుతున్నాడు.

అయితే ఈ వ్యాపారం ద్వారా పెద్దగా ఆదాయం రాకపోయేసరిగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఢిల్లీ నుంచి వచ్చే స్మగ్లింగ్ సరుకు (ఫేక్ సిగరెట్) ట్రాన్స్‌పోర్టు నుంచి రిసీవ్ చేసుకోవడం, విక్రయించడానికిఅలవాటుపడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు.