calender_icon.png 15 January, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

05-09-2024 01:00:40 AM

హనుమకొండ, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఓ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వరంగల్, కాజీపేట తహసీల్దార్ రబ్బర్ స్టాంప్‌లతో పాటు హనుమకొండ జిల్లా పేరిట ఉన్న రబ్బర్ స్టాంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ నందిరాంనాయక్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

వరంగల్ నరగంలోని దేశాయిపేటకు చెందిన జూలూరి చక్రపాణి, కొత్తవాడకు చెందిన గోవిందు సతీష్‌కుమార్, మాన్యం సిద్ధయ్య తహసీల్దార్‌తో సంబంధం లేకుండా రబ్బర్‌స్టాంప్‌లు సృష్టించి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. ఇలా పలువురికి బిజినెస్ లైసెన్స్ రెన్యూవల్‌కు సంబంధించి సర్టిఫికెట్లు, ఫ్యా మిలీ సర్టిఫికెట్లు, ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పోవడంతో నకిలీ పట్టాలు తయారు చేసి ఇచ్చారు.

హనుమకొండ టైలర్ స్ట్రీట్‌కు చెందిన సముద్రాల కిరణ్ రబ్బర్ స్టాంప్‌లు తయారు చేసి ముఠాకు సహకారం అందిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో వరంగల్ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నింది తులు పస్తం సతీష్, జూలూరి చక్రపాణి, గో విందు సతీష్‌కుమార్, అజారుద్దీన్, సయ్యద్ సాబీర్, మాకుల దామోదర్, కాశెట్టి కమలాకర్, సముద్రాల కిరణ్‌ను అరెస్ట్ చేశారు. సిద్ధ య్య అనే నిందితుడు పరారీలో ఉన్నాడు.