calender_icon.png 6 March, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైటెక్ సిటీలో నకిలీ కాల్‌సెంటర్‌ ముఠా అరెస్ట్

06-03-2025 01:27:29 PM

హైదరాబాద్: నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్న ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మనస్విని హైటెక్ సిటీలో 'ఎక్సిటీ సొల్యూషన్స్' పేరిట కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. కైవాన్ పటేల్, ప్రతీక్ రాహుల్ తో కలిసి మనస్విని కాల్ సెంటర్ ను నిర్వహిస్తోంది. నాగాలాండ్ కు చెందిన వ్యక్తులను మనశ్విని టెలీకాలర్లుగా నియమించుకుంది. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు సైబర్ మోసాలు చేస్తున్నారు. నిందితుల నుంచి 63 ల్యాప్ టాప్ లు , 52 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నిందితులు నగదు కాజేస్తున్నారు.