calender_icon.png 2 April, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ బాబా అరెస్ట్ !

21-03-2025 12:27:15 AM

 మత్తుమందు ఇచ్చి మహిళలపై అత్యాచారం

 ఆపై నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్

 అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు

 జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి

మెదక్, మార్చి 20(విజయక్రాంతి); అనారోగ్యంతో బాధపడే వారిని బాగు చేస్తానని నమ్మబలికి..వారికి మత్తుమందు ఇచ్చి పలువురి మహిళలపై అఘాయిత్యం చేసిన దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపిన వివరాలు ఇలావున్నాయి..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం పరిధిలో అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెర బాపుస్వామి అలియాస్ శివస్వామి అనే వ్యక్తి జ్యోతిష్యం చెబుతానంటూ అవతారం ఎత్తి ఎవరికైనా ఆరోగ్యం బాగులేకున్నా, ఇంట్లో ఆర్థిక స్థితి బాగులేకున్నా తాను ప్రత్యేక పూజలు చేసి బాగుచేస్తానని నమ్మబలుకుతూ మహిళాలనే టార్గెట్ చేసి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం శివస్వామి అనే పేరిట విజిటింగ్ కార్డు పంచుతూ సంచరిస్తున్నట్లు తెలిపారు. ఇతని మాయలో పడ్డ మహిళలకు నిమ్మ కాయ, పసుపు, కుంకుమ వాసనలు చూపిస్తూ నీటిలో నిద్ర మాత్రలు కలిపి తాగించేవాడు. సదరు మహిళ సృహ కోల్పోయిన తర్వాత ఆమెను శారీరకంగా అనుభవించి మొబైల్ లో వీడియోలు తీసేవాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ మహిళలకు ఫోన్ చేసి నగ్నంగా ఉన్న వీడియోలు ఉన్న విషయం చెప్పి బ్లాక్ మెయిల్ చేసి మహిళల ఆర్థిక స్తోమతను బట్టి వేల నుంచి లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసేవాడన్నారు. ఇతర జిల్లాల్లో కూడా ఇదే విధంగా జ్యోతిష్యం పేరుతో వసూలు చేసిన చరిత్ర ఈ స్వామికి ఉన్నట్టు గుర్తించామన్నారు. బ్లాక్ మెయిల్ చేసిన డబ్బుతో ఐ ఫోన్, వాహనాలు కొని ఈ బ్లాక్ మెయిల్ బాబా రాజభోగాలు అనుభవిస్తున్నాడని, స్వామి చేస్తున్న బ్లాక్ మెయిల్ వ్యవహారం బాధితుల నుంచి పోలీసులకు సమాచారం రావడంతో నిఘా పెట్టి నర్సాపూర్ లో స్వామిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం విచారణ జరిపి అతని మొబైల్ ఫోన్ పరిశీలించగా మహిళల నగ్న వీడియోలు, బ్లాక్ మెయిల్ చేసి వసూల్ చేసిన ఆన్ లైన్ వివరాలను తాము గుర్తించామన్నారు. అతడి వద్ద పూజలకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ తదితరులుఉన్నారు.