calender_icon.png 2 March, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ అడ్వకేట్ అరెస్ట్

01-02-2025 01:22:22 AM

సిరిసిల్ల, జనవరి 31 (విజయక్రాంతి): అడ్వకేట్ నందు పలువురు వద్ద లక్షల్లో పైసలు వాసులు చేసిన నకిలీ అడ్వకేట్ ను అరెస్టు చేసినట్లు సిరిసిల్ల టౌన్ సిఐ కష్ణ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నెహ్రూ నగర్ కు చెందిన  ఏనుగు ఫణిందర్ అనే నకిలీ అడ్వకే ట్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామ న్నారు. 

తను ఓ అడ్వకేట్ వద్ద పని చేసిన ప్పుడు కోర్టుకు భూమి,ఇతర సివిల్ తగాదా ల గురించి, లోన్ సమస్యల గురించి, బార్య భర్తల గొడవల గురించి న్యాయ సహయం కొరకు  వచ్చే వారిని గమనించిన ఫణిందర్ వారితో తానే అడ్వొకేట్ ను అని నమ్మించా డు. అడ్వకేట్ల కొరకు కు వచ్చే బాధితులతో పరిచయాలు చేసుకుంటూ అడ్వకేట్ అని నమ్మించి, తనకు హైదరాబాదు హై కోర్టు నందు చాలా మంది లాయర్లు, అధికారులు తెలుసని వారికి చెప్పి, కేసులను కోర్టులలో ఫైల్ చేసి సమస్యలను తీర్చుతానని నమ్మిం చేవాడు.

బడ్స్ అండ్ ఫ్లవర్స్ ప్రైవేట్ స్కూల్ యజమాని కొంటికర్ల వారణాసి కాలిమాత అనునామే గుంటూరులో ఉన్న భూమి పరి ష్కారం గురించి మాట్లాడుతూ నమ్మించి మోసం చేసి,ఆమె వద్ద నుండి రూ.25 లక్ష లు తీసుకొన్నాడు, ఎలాంటి మోసాలు చేసి నా పోలిస్ వారు తనను ఏమీ  చేయలేరని, సంజీవయ్య నగర్‌కు చెందిన దరిపల్లి సురే ష్, అతడి అన్న రమేష్‌లు తను అడ్వకేట్ అని నమ్మి తన వద్దకు వెళ్లి వారి పైన చెక్ బౌన్సు కేసులు కోర్టులలో పెండింగ్లో ఉన్నాయని చెప్పితే వారిని నమ్మించి పలు దపా లుగా మొత్తం రూ.91,52,050 లక్షలు తీసు కున్నాడు, పెద్దూర్ లోని డబల్ బెడ్ రూమ్స్ కి  చెందిన విజయ లక్ష్మి ను నమ్మించి మో సం చేసి చంపుతానని బెదిరించి రూ.1,90 లక్షలు తీసుకొన్నాడు.

అదేవిదంగా  చంద్రం పేటకు చెందిన యెల్ల లలిత భూమి విష యం పరిస్కరిస్తానని చెప్పి కేసు వేసి ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి ఆమె వద్ద నుండి రూ.11,60 లక్షలు  బలవంతం గా వసూలు చేసినాడు.  బాదితుల పిర్యాదు లపై కేసులు నమోదు చేసి నిందుతున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని సీఐ కష్ణ పేర్కొన్నారు.