calender_icon.png 30 October, 2024 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మకం.. విశ్వాసమే నా ఆస్తి

18-07-2024 02:25:01 AM

ఎంపీ ఈటల రాజేందర్

ఎల్బీనగర్, జూలై17: తనకు పదవి ముఖ్యం కాదని, వ్యక్తిత్వమే ముఖ్యమని, నాయకులందరూ అవినీతిపరులు కారని, కొందరు నిజాయితీగా ఉంటారని వారిలో తాను ఒకడినని మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నమ్మకం, విశ్వాసమే తనకు ఆస్తి అని చెప్పారు. వనస్థలిపురంలో బుధవారం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కు ల సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఒక పార్టీ అధినేత ఆహంకారంతో తనను వదులకుంటే బీజేపీ అక్కున చేర్చుకున్నదని, బీజేపీని వీడేదిలేదని స్పష్టం చేశారు. అన్నివర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ గ్రాంట్స్‌తోపాటు అందుబాటులో ఉన్న మార్గాలతో నిధులు కేటా యిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. పెన్షన్‌దారులకు నోటీసులు ఇవ్వడం తప్పని పేర్కొన్నారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బ న్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాల్గొన్నారు.