ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఘనంగా బండల మల్లన్న జాతర...
పటాన్ చెరు: జాతరలు తెలంగాణ సాంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకలు అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఉత్సవాలలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, గూడెం పల్లవి విక్రమ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.