ముఖరా (కె)లో మెడకు ఉరి తాళ్లు బిగించుకొని రైతులు నిరసన
ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ ఇంకె ప్పుడు చేస్తారని, చేయకుంటే తమకు చావే శరణ్యమం టూ రైతులు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామం లో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ సుభాష్ ఆధర్యంలో సోమవారం రైతు దినోత్సవం రోజున రైతులు మెడకు ఉరితాలను బిగించుకొని నిరసన చేపట్టారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా, రైతుబంధు వేయకుండా కాం గ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేస్తుందన్నా రు.
వెంటనే రుణమాఫీ రుణమాఫీ చేయాలని కోరారు. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్మల్ మండలంలోని అనంతపేట్, లక్ష్మణ చాందా మండలంలోని భాబాపూర్ గ్రామాలకు చెందిన రెండు వందల మంది రైతు లు నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదని వాపోయా రు. బ్యాంకుల్లో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రుణం చెల్లిం చాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.