calender_icon.png 16 January, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల వినియోగంలో విఫలం

05-09-2024 04:00:00 AM

హరీశ్‌రావు ట్వీట్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను విని యోగించకుండా, వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల మైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ట్వీట్ చేశారు. వరద పరిస్థితిపై ఇప్పటికీ కేంద్రానికి నివేదిక ఇవ్వలేదనే విషయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖతో స్పష్టమైందన్నారు. ప్రభుత్వ ఖాతా లో రూ.1345.15 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను ఎందుకు వినియోగించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఈ ఏడాదికి సంబంధించిన రూ.208 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జూన్‌లోనే జమైనట్లు తెలిపారు. కాంగ్రెస్ అవగాహనారా హిత్యం కారణంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు.

పార్ట్‌టైమ్ లెక్చరర్లు, టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి 

సోషల్ వెల్ఫేర్లలో పని చేస్తున్న 6,200 మంది పార్ట్‌టైమ్ టీచర్లు, లెక్చరర్లను విధుల నుంచి తొలగించడం సరికాదని హరీశ్‌రావు సీఎంకు లేఖ రాశారు. వారి పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని కోరారు. సెప్టెం బర్ 5న  టీచర్స్ డేని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు అదనపు ప్రోత్సాహకాలు అంది చడం ఆనవాయితీ అని, దాన్ని పాటించకపోగా అర్ధాంతరంగా తొలగించి, వారి కుటుం బాలను క్షోభ పెట్టడం సరికాదన్నారు. జీతా లు అడిగినందుకే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. పార్ట్‌టైమ్ లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.