calender_icon.png 14 November, 2024 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం, పత్తి కొనుగోళ్లలో విఫలం

14-11-2024 12:37:00 AM

మర్రిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

  1. ప్రభుత్వం నిర్లక్ష్యంతో దళారులపాలు
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

మునుగోడు/మర్రిగూడ, నవబంర్ 13: ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందిని మాజీ మంత్రి హరీవ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం దళారులపాలవుతున్నదని విమర్శించారు. బుధవారం మునుగోడు నియోజ కవర్గం మర్రిగూడెం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతోపాటు బీఆర్‌ఎస్ నేత పాల్వయి స్రవంతితో కలసి వడ్ల కోనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. గతేడాది నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఈ సంవత్సరం కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు రావడంతో ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగయింన్నారు.

ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసి ముడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కిలో సన్న వడ్లను కూడా కొనలేదన్నారు. 

కాంగ్రెస్ ప్రకటించిన రైతుబంధు రూ.15,000 ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొన్నా  రైతులకు సకాలంలో డబ్బులు అదించే పరిస్థిలో ప్రభుత్వం లేదన్నారు. కొన్న వడ్లకు కూడా విపరీతంగా తరుగు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు.