calender_icon.png 9 January, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫడ్నవీస్ ఒక్కరే యాక్టివ్‌గా ఉన్నారు

05-01-2025 01:39:14 AM

* సుప్రియా సూలే

ముంబై, జనవరి 4: నూతనంగా ఏర్పడిన మహారాష్ట్ర మంత్రివర్గంలో సీఎం ఫడ్నవీస్ ఒక్కరే క్రియాశీలంగా ఉన్నారని ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే వ్యాఖ్యనించారు. మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చొరవను ప్రధాని మోదీ ప్రశంసించిన తర్వాతి రోజే సుప్రియా సూలే ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో కొత్త శకానికి నాంది పలకాలని సీఎం గడ్చిరోలిలో పర్యటన చేయడాన్ని ఆహ్వానిస్తున్నాం. దివంగత నేత ఆర్‌ఆర్ పాటిల్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు గడ్చిరోలి అభివృద్ధికి కృషి చేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. 

రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటైన తొ లిరోజు నుంచి కేవలం సీఎం ఒక్కరే యాక్టివ్ మోడ్‌లో ఉన్నారని, మిగతావారెవరూ క్రియాశీలకంగా లేర న్నారు. శివసేన (యూబీటీ) అధికార పత్రిక సామ్నా సైతం ‘కంగ్రాట్యూలేషన్ దేవా బాహు’ పేరిట ఎడి టోరి యల్ పేజీలో కథనాన్ని ప్రచురించింది.

నక్సలైట్ జిల్లాగా పేరుగాంచిన గడ్చిరోలిని స్టీల్ సిటీగా మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనను ఆహ్వానిస్తూనే.. బీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ హత్యానంతరం శాంతిభద్రతల పరిస్థితిని ఉటంకించింది. బీడ్‌లో తుపాకు లు రాజ్యమేలుతుంటే.. గడ్చిరోలిలో రాజ్యాంగ పాలన కొనసా గుతుందా అంటూ విమర్శలు గుప్పించింది.