calender_icon.png 20 September, 2024 | 10:56 AM

గాంధీలో మరణాలపై నిజనిర్ధారణ కమిటీ

20-09-2024 01:44:26 AM

  1. ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురదజల్లడం మానుకోవాలి 
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): గాంధీ హాస్పిటల్‌లో వరుస మరణా లపై తమ పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిపుణుల కమిటీ గాంధీలో జరుగుతున్న మరణాలపై అధ్యయనం చేసి, గుర్తించిన అంశాలను ప్రభుత్వంతోపాటు ప్రజలతోనూ పంచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీలో జరుగుతున్న మరణాలపై దృష్టి సారించాల్సిందిపోయి..

ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తమపై ఎదురుదాడికి దిగడం బాధాకరమన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో సీనియర్ డాక్టర్లను బదిలీపై పంపారన్న ఆరోపణల్లో వాస్తవం కాదా ప్రశ్నించారు. ప్రభుత్వానికి సర్కార్ ఆసుపత్రిలో సంభవిస్తున్న మరణాల ను ఒక సంఖ్యగా మాత్రమే చూస్తోందని, మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు మరిన్ని విషయాలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ విషయంలోనూ మహిళలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలోని సగంమందికిపైగా ప్రజలు ఎలాంటి రాయితీ పొందడం లేదన్నారు.

నమ్మించి మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశా రు. మానవత్వం చూపాల్సిన చోట కూడా ఈ కోతలెందుకు అంటూ ఖమ్మం వరద సాయం పై ప్రభుత్వాన్ని నిలదీశారు. సినిమాల్లో వేషా లు వేసుకొనే కంగనా రనౌత్‌కు రాహుల్ విమర్శించే నైతిక హక్కు లేదని దానం నాగేందర్ పేర్కొనడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. దానం వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, కంగనా విషయంలో ఆయన ఉపయోగించిన భాష ఆమోదయో గ్యం కాదన్నారు.

అసోం సీఎం హిమంత బిస్వశర్మ సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణలోని మీ సొంత పార్టీ సభ్యులు, రేవంత్ రెడ్డి స్పందించకముందే కేసీఆర్ స్పందించారని గుర్తు చేశారు. రాజ కీయాలను పక్కనపెడితే నీతి, మర్యాదకు కట్టుబడి ఉంటామన్నారు. నగరంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని కేటీఆర్ సూచించారు. నాచారం వద్ద ఎల్‌పీజీ ట్రక్కు ఢీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాం తి కలిగించిందన్నారు.