calender_icon.png 12 October, 2024 | 11:55 AM

టీమిండియాకు ఎదురుందా?

09-10-2024 12:33:55 AM

నేడు బంగ్లాదేశ్‌తో రెండో టీ20 

సిరీస్ విజయంపై భారత్ కన్ను

* ఈ దఫా భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి గెలుపు రుచి చూడని బంగ్లాదేశ్ టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్ గెలిచిన సూర్య సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లా భావిస్తోంది.

1టీ20లలో భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే బంగ్లా మీద ఓడిపోయింది. 2019లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచింది. 

ఢిల్లీ: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య నేడు ఢిల్లీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి టీ20లో బంగ్లాకు ముచ్చెమటలు పట్టించిన భార త బౌలర్లు, బ్యాటర్లు ఇవాళ కూడా అదే ఫీట్‌ను పునరావృతం చేయాలని భావిస్తున్నారు.

తొలి టీ20లో చిత్తుగా ఓడి  నైరా శ్యంలో కూరుకుపోయిన బంగ్లా బృందానికి మరోమారు ఓటమి రుచి చూపించి మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2 తేడాతో కైవసం చేసుకోవాలని భావి స్తోంది. మొదటి మ్యాచ్ జరిగిన తీరు చూస్తే ఈ మ్యాచ్‌లో కూడా సూర్య సేనను ఆపే సత్తా బంగ్లా వద్ద ఉందనుకోవడం అత్యాశే అవుతుంది.

కానీ టీ20 లలో ఏదైనా జరగచ్చు. భారత్ తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశముంది. బ్యాటింగ్ కాంబినేషన్‌లోనూ పెద్దగా మార్పులుండకపోవచ్చు. ఓపెనర్లు శాంసన్, అభిషేక్ రానుండగా.. మిడిలార్డర్‌లో సూర్య, నితీశ్ రెడ్డి, హార్దిక్, రియాన్ పరాగ్ రానున్నారు. ఫినిషర్‌గా రింకూ ఉన్నాడు. బౌలింగ్‌లో స్నిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సుందర్‌తో పాటు పేసర్లు అర్ష్‌దీప్, మయాంక్‌లు మరోసారి కీలకం కానున్నారు.

టాస్ గెలిస్తే బౌలింగ్‌కే మొగ్గు..

మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలుకానుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇప్పటి వరకు 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు.. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు తొమ్మిది సార్లు విజయాలు సాధించాయి. మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 139 కాగా, రెండో ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 133గా ఉంది. అత్యధిక స్కోరు 212/3గా నమోదైంది.

పాయింట్ల పట్టిక

గ్రూప్‌-ఏ 

జట్టు మ్యా గె పా రరే

ఆస్ట్రేలియా 2 2 0 4 +2.5

పాకిస్థాన్ 2 1 1 2 +0.5

న్యూజిలాండ్ 2 1 1 2 -0.5

భారత్ 2 1 1 2 -1.2

శ్రీలంక 2 0 2 0 -1.6

నోట్: మ్యా-మ్యాచ్‌లు, గె-గెలుపు, 

ఓ-ఓటమి, పా-పాయింట్లు, రరే-రన్‌రేట్