రావల్పిండి: బంగ్లా- పాక్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ పట్టు బిగిస్తోంది. మొదటి టెస్టు గెలిచి ఊపు మీదున్న బంగ్లా అదే ఊపులో ఈ టెస్టు కూడా గెలవాలని భావిస్తోంది. కనీసం ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ ఆతిథ్య పాకిస్తాన్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు కట్టడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసిన బంగ్లాదేశ్ మూడో రోజు ముగిసే సరికి పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 9/2 కి కట్టడి చేయగలిగింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న క్రమంలో తప్పకుండా ఈ టెస్టులో ఫలితం తేలుతుందని అంతా అంటున్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ దాస్ సెంచరీతో కదం తొక్కగా.. మిరాజ్ (78) అతడికి చేదోడుగా నిలిచాడు. కాగా పాక్ బౌలర్లలో షెహజాద్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. మరి నాలుగు రోజు పాక్ బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనే విషయంపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంది.