బాసర (విజయక్రాంతి): బాసర సరస్వతి ఆలయ ప్రాంగణానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ఇన్చార్జి మంత్రి సీతక్క(Minister Sithakka) సహకారంతో కృషి చేసినట్లు మాజీ సర్పంచ్ రమేష్ అన్నారు. గురువారం బాసరలో వసంత పంచమి పురస్కరించుకొని భక్తులకు తాగునీరు అందించేందుకు మంత్రి సీతక్క సాహకారంతో కొత్త బోర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్, దేశముఖ్, దేవేందర్, సాయిలు, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.