రామగిరిలో ఆత్మీయ సమ్మేళనంలో విశ్రాంత ఉద్యోగులు
రామగిరి, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : విశ్రాంత ఉద్యోగులందరికీ సింగరేణి యాజమాన్యం అన్ని వతు లు కల్పించాలని, రామ గిరి మండలంలోని సెంటి నరీ కాలనీ సాయిరాం గార్డెన్ లో ఆదివారం సింగరేణి విశ్రాంతి రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం లో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా అడ్రియాల జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగులందరూ తమ డిమాండ్లను సింగరేణి యాజమాన్యం నెరవేర్చాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగి లేదా అతని భార్య మృతి చెందితే ప్రతి ఒక్కరూ రూ.100 ఆర్థిక సహాయం కింద అందించాలని ఆర్జీ- 3లో ఒక రెస్ట్ హాల్ కు భూమి కేటాయించి, నిర్మాణం చేపట్టాలని, పీ.పీ.ఓ కాపీలు విశ్రాంతి ఉద్యోగుల ఫోన్లకు మెసేజ్ అందేలా చూడాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గౌతమ్ శంకరయ్య, వేగోళపు మల్లయ్య, సురభి ప్రసాద్, రాజ సమ్మయ్య, తోట మొండయ్య, పట్నం సత్యనారాయణ, పగడాల జగదీష్,పాముల శేషగిరి, గజేల్లి. వెంకన్న, చెల్కల జవహర్, కొప్పుల రవీందర్ రావు తదితరులు పాల్గోన్నారు.