16-04-2025 10:18:59 PM
డిఆర్డిఎ పిడి కిషన్..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలందరికీ పని స్థలాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించారని జిల్లా డీఆర్డీఏ పీడీ కిషన్ సూచించారు మండలంలోని చిర్రకుంట గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. కూలీలందరికీ పని స్థలాల్లో తాగునీరు, నీడ, కల్పించాలని అన్నారు. కూలీలకు అసౌకర్యాలు కలగాకుండా చూడాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో రజియా సుల్తానా, పంచాయతీ సెక్రెటరీ రమేష్, ఈసి మధు, టెక్నికల్ అసిస్టెంట్ రాజమల్లు, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణలు పాల్గొన్నారు.