నిర్మల్, జనవరి 6 (విజయక్రాంతి): పేద విద్యార్థుల కోసం స్థాపించిన గురుకుల పాఠశాలల్లో సదుపాయాలు కల్పించేందుకు చర్య తీసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం చేశారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ బాలికల గురు పాఠశాల కళాశాలలో రూ.61 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాఠశాలలో సిబ్బంది ఉండేందుకు భవన నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.
అనంతరం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేవని, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యేకు విన్నవించారు. త్వరలో ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి గురుకులాలకు నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని ఎమెమ్ల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డానియల్ ఉన్నారు.