నిర్మల్ (విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించి పెండింగ్లో ఉన్న అద్దె భవనాల సొంత భవనాలు నిర్మించాలని వేతనాలు పెంచాలని కోరుతూ ఏఐటీయూసీ అంగన్వాడీ యూనియన్ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు కలిసి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీలకు ఆయలకు వేతనాలు పెంచాలని జిల్లా కార్యదర్శి విలాస్ అంగన్వాడి అధ్యక్షురాలు పద్మా కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.