- సీపీఎం ధర్నాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్
- జాప్యం చేస్తే ఆందోళన చేపడుతాం: సీపీఎం
ముషీరాబాద్, జూలై 14: గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వం నిర్మించిన 65 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద సదుపాయాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రాంతాల్లో మంచినీటి, కరెంట్ సదుపాయం, రోడ్డు, లిఫ్టులు ఏర్పాటు చేయక పోవడంతో ఇళ్లు పొందిన పేదలు అందులో నివసించే పరిస్థితి లేదన్నారు. తక్షణమే మౌలిక సదాపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఆదివారం ఇంది రాపార్కు ధర్నాచౌక్‌లో సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇళ్ల వద్ద సదుపాయాల కల్పనకు రూ.7 వందల కోట్లు అవసరమని జీహెచ్‌ఎంసీ, హౌజింగ్ అధికారులు తెలియజేస్తు న్నందున రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగ ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇం డ్ల నిర్మాణంలో జాప్యం చేసి, కనీస సౌకర్యా లు కల్పించకుండానే ఎన్నికల ముందు హడావిడిగా కేటాయింపు జరింపిందని ఆరోపించారు.
దీని కారణంగానే పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నా రు. సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభు త్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీ ఎం నగర నాయకులు దశరథ్, మహేందర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నగర కార్యదర్శి నాగలక్ష్మి, డబుల్ బెడ్‌రూం ఇండ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.