calender_icon.png 6 February, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంచు గ్రామాల్లో వసతులు మెరుగుపరచాలి

06-02-2025 12:37:01 AM

* జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాలైన అమ్రాబాద్, పదర మండలాల్లోని గ్రామాల్లో నివసిస్తున్న చెంచుల జీవన ప్రమాణాల పెంపుకు తెలం గాణ సమ్మిలిత జీవనోపాధి కార్యక్రమం (టిజిఐఎల్పి) కార్యక్రమంలో గుర్తించి అభి వృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు.

బుధవారం నాగర్ కర్నూ ల్, నారాయణపేట, ములుగు, కొమరం భీం, ఆసిఫాబాద్, అదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు డిఆర్డిఓలతో తెలంగాణ; సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమ అంశంపై తెలంగాణ సేర్ఫ్ సీఈవో దివ్య హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ అంశంపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేశా రు.

నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసి చెంచుల సుస్థిర జీవన ప్రమాణా లను మెరుగుపరచడానికి సహాయ సహకా రాలు అందించాలన్నారు. అత్యంత నిరుపే దలైన వెనుకబడిన కుటుంబాలకు తప్పనిస రిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్య,  వైద్యఆరోగ్యం, బ్యాంకింగ్, సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. 

ప్రతి మండలానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమించనున్నట్లు వారి ద్వారా అత్యంత నిరుపేదలైన కుటుం బాలను గుర్తించ నున్నట్లు తెలిపారు. వారి జీవన విధానం మెరుగుపరచడానికి కావల సిన సంక్షేమ పథకాలు అందించనున్నట్లు, మౌలిక సదుపాయాలైన మంచినీరు సోలార్ విద్యుత్తు, రహదారి, అంగన్వాడి, పాఠశాలలు లాంటి సదుపాయాలు కల్పిం చామని, స్థిర వ్యాపారం చేసుకోవడానికి కావలసిన ఆర్థిక సహకారం బ్యాంకు నుంచి అందించనున్నట్లు, అటవీ ఉత్పత్తు లైన తేనె, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, తూనికా కు సేకరణ ద్వారా శాశ్వత అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు.

ఒంటరి మహిళలు దివ్యాంగులు భూములు,  ఇల్లు లేని నిరుపే దలు వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ క్యా స్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీలకు చెందిన వారి ని గుర్తించాలన్నారు.  వారితో పాటు డిఆర్డి ఓ పిడి చిన్న ఓబులేసు, డిఆర్డిఓ డిస్టిక్ కోఆ ర్డినేటర్ అంజయ్య, డిఎంహెచ్వో స్వరా జ్యలక్ష్మి, డిడబ్ల్యుఓ రాజేశ్వరి పాల్గొన్నారు.