calender_icon.png 5 October, 2024 | 1:05 PM

సింగరేణి ప్రభావిత గ్రామాల్లో సదుపాయాలు

05-10-2024 02:17:40 AM

ఖమ్మం, అక్టోబర్ 4 (విజయ క్రాంతి): సింగరేణి ప్రభావిత గ్రామా ల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్  తెలిపారు. శుక్రవా  రం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమ యితో కలిసి సత్తుపల్లి మండలం లోని సింగరేణి ప్రభావిత కిష్టారం గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. కాలుష్యం, బాంబు పేలుళ్లు, వ్యర్థాల తో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

సింగరేణి యాజమాన్యం  ఏర్పాటు చేసిన సైలో బంకర్ ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,  నీరు, గాలి కలుషితం అవుతున్నాయ ని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొ చ్చారు. అనంతరం పాఠశాల ఆవర ణలో సింగరేణి భూనిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..

సైలో బంకర్ నుంచి వచ్చే కాలుష్యాన్ని  అరికట్టేం దుకు సింగరేణి జీఎంతో చర్చించి, చర్యలు తీసుకుంటామన్నారు. బాస్టి ంగ్, వర్షాల కారణంగా ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని తొలగించి కొత్తవి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు