కాప్రా,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ హెబి కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ నిధులతో పనులు చేపట్టి పూర్తి చేయడంతో స్థానిక కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్, బీఈఎల్ మేనేజర్స్ శ్రీనివాస్ విశ్వనాథం కందుకూరి రవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం బిఈఎల్ 21 లక్షలు కేటాయించడం హర్షనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు నా వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నాగేందర్ రెడ్డి, బిల్ కంపెనీ ప్రతినిధులు శ్రీనివాసరావు, సౌందర్య రాజు, నీల్ కుమార్ సింగ్, గుమ్మడి జంపాల్ రెడ్డి, వెంకటాచారి, భూపతి అశోక్, చంద్రమోహన్, బాలరాజ్, నవీన్ గౌడ్, జైపాల్, జ్యోతి, శ్యామసన్, సంతోష్, అశోక్ రెడ్డి, బాల నరసింహ, నిస్సార్ అహ్మద్ గోరి, వసంతరావు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.