చలికాలంలో చాలామంది చర్మ పొడిబారుతుంటుంది. అయితే ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో ముఖంపై సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెతో ముఖంపై మచ్చలు గీతలు లేకుం డా చేయొచ్చు. కొబ్బరి నూనెను డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో అప్లై చేయడం వల్ల ముఖం యవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. కొబ్బ రి నూనె మన అందరి ఇండ్లలో సులభంగా అందుబాటులో ఉం టుంది. దీంట్లో ప్రకాశించే గుణాలు పుష్కలంగా ఉంటాయి.
కొబ్బరినూనెను నిమ్మరసం వేసి ముఖానికి అప్లై చేయ డం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి రక్షించే గుణాలు ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులో వాడే నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మీ ముఖ కాంతిని పెంచుతుంది.