నందమూరి కల్యాణ్‌రామ్ ఓ యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ‘ఎన్‌కేఆర్21’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి పూర్తి యాక్షన్, ఎమోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తు తం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా, కల్యాణ్‌రామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఇందులో ఇంకా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోహైల్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. సోహైల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ముఖ్యంగా కథానాయకు డితో ముఖాముఖిగా తలపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్; డీవోపీ: రామ్‌ప్రసాద్; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.