ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్లోని సచిలవాలయం లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల హాజరు నమోదుకు ఇకపై ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అందుబాటులోకి రానున్నది. ఈమేరకు మంగళవారం ప్రభుత్వ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. హాజరు విషయంలో కచ్చితత్వంతో పాటు భద్రతను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక హాజరు నమోదు విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయంలోని అన్ని ఎంట్రీలు, ఎగ్జిట్లతో పాటు ప్రతి ఫ్లోర్లో ఈ మెషిన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.