* ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర సచివాలయంలో గురువారం నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్‌తో పాటు సచివాలయంలోని విభాగాధిపతుల నుంచి వేతనాలు పొందుతున్న సిబ్బంది అందిరికీ ఈ నిబంధన వర్తింస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆఫీస్‌కు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు కచ్చితంగా హాజరును రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఏమైన సమస్యల వల్ల అటెండెన్స్ రిజిస్టర్ కాకపోతే.. సంబంధిత అధికారిని సంప్రదించాలని సీఎస్ సూచించారు. అని డిపార్ట్‌మెం ట్స్ ముఖ ద్వారాల వద్ద ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.