09-02-2025 12:47:07 AM
* రెండో వన్డేలో గెలుపుపై రోహిత్ సేన నజర్..
* ఇది కూడా గెలిస్తే సిరీస్ గెలిచినట్లే..
కటక్: ఇంగ్లిష్ జట్టుతో రెండో వన్డే కోసం ఇండి యా సిద్ధం అయింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే గెలిచి ఊపుమీదున్న రోహిత్ సేన కటక్‌లో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరో పక్క ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సజీవంగా ఉంచాలని ఇంగ్లండ్ ప్రయత్నాలు చేస్తోంది.
మొదటి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన ఇక్కడ కూడా అదే సీన్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. బ్యాటర్లు పర్వాలేదనిపిస్తున్నా కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కొద్ది రోజులుగా వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రోహిత్ బ్యాడ్ ఫామ్ కంటి న్యూ అవుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ బ్యాట్ కు పని చెబుతాడేమో వేచి చూడాలి.
కోహ్లీ ఫిట్..
గాయం కారణంగా మొదటి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ ఆడడం ఖాయంగానే కనిపిస్తోంది. విరాట్ కనుక మ్యాచ్ బరిలోకి దిగితే అతడి కోసం అయ్యర్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తొలి వన్డేలో అర్ధ సెంచరీ చేసిన అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విక్టరీ సులువు చేశాడు. మరి ఈ వన్డేలో కోహ్లీ కోసం అయ్యర్‌ను పక్కన పెడతారా లేకపోతే మరే ఇతర ఆటగాడినైనా కూర్చోబెడతారా వేచి చూడాలి.