calender_icon.png 24 February, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ విజయంపై కన్ను

28-01-2025 01:17:28 AM

* నేడు భారత్, ఇంగ్లండ్ మూడో టీ20

రాజ్‌కోట్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండింటిలో గె లిచిన టీమిండియా హ్యాట్రిక్ విజయం తో సిరీస్‌ను ఒడిసిపట్టాలని భావిస్తోం ది. సూర్య సారధ్యంలోని భారత్ నేడు రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌పై గుబులు నెలకొంది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే వెనుదిరిగిన సూర్య మూడో టీ20లో రాణించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక తెలుగు తేజం తిలక్ వర్మ సూపర్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. బౌలింగ్‌లో స్పెషలిస్ట్ పేసర్‌గా అర్ష్‌దీప్ రాణిస్తుండగా.. మరోవైపు ఇంగ్లండ్ మూడో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.