calender_icon.png 20 January, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లీన్ స్వీప్‌పై కన్ను

30-07-2024 12:30:22 AM

పల్లెకెలె: శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేడు నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన సూర్యకుమార్ సేన మ్యాచ్ గెలవాలని భావిస్తుండగా.. లంక మాత్రం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. నామమాత్ర పోరు కావడంతో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. శివమ్ దూబే, సుందర్, ఖలీల్‌లో కనీసం ఇద్దరు నేటి మ్యాచ్‌లో బరిలో దిగే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా పటిష్టంగా కనిపిస్తుండగా.. మరోవైపు లంక మాత్రం వరుస రెండు ఓటములతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.