24-02-2025 12:50:29 AM
సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి
మునుగోడు, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీరాజగోపాల్రెడ్డి తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు.
మూడు విడతల్లో 1,781 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 324 మందికి ఆపరేషన్లు చేయించినట్లు ఆమె వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన శంకరా కంటి దవాఖాన, ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటి సమస్యలతో బాధపడే వారు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.