08-04-2025 12:06:16 AM
సిరిసిల్ల, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): అంగన్వాడి కేంద్రాల్లో చదివే ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బ్లైండ్ నెస్ ప్రివెన్షన్ వీక్ అందత్వ నివారణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా లోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లోని 06 నెలల నుంచి 06 ఏండ్లలోపు పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్ర మాన్ని తంగళ్లపల్లి మండలంలోని బస్వా పూర్‌లో సోమవారం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ప్రారంభించారు.
వైద్య పరీక్షలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లోని విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏమైనా లోపాలు గుర్తించిన పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు. ఎక్కువ ఇబ్బంది పడే విద్యా ర్థులకు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అ ందించాలని తెలిపారు. తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్ లోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.