నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఉన్న శంకర కంటి ఆసుపత్రిలో గురువారం ఏర్పాటుచేయనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు, ప్రధాన కార్యదర్శి రఘుబాబు కోరారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 17న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో సేవలు పొందేందుకు ‘మా’ సభ్యులు ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా తీసుకురావచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం డాక్టర్ మాదాల రవి, వైస్ ప్రెసిడెంట్‌ను మొబైల్ నంబర్ 98480 52402 ద్వారా సంప్రదించాలని సూచించారు.