10-04-2025 02:15:24 AM
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 9 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బంది వారి కుటుంబాలకు ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పోలీస్ అధికారులు, సిబ్బంది కొరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి శరీరంలోని అన్ని అవయవాలలో కళ్ళు చాలా ప్రధానమైనవి అన్నారు.ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కంటిచూపును ఎప్పటికప్పుడు సరిగా కాపాడుకోగలిగితేనే మన దైనందిన కార్యక్రమాలను సరిగ్గా చేసుకోగలమని తెలిపారు. పోలీసు అధికారులు,సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కంట పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.
అనంతరం ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మందికి పైగా కంటి పరీక్షలు (స్క్రీనింగ్,డిస్టెన్స్ విజిబిలిటీ టెస్ట్) చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్టౌన్ సిఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్, 3టౌన్ సీఐ శివప్రసాద్,జూలూరుపాడు సీఐ ఇంద్రాసేనారెడ్డి,ఆర్‌ఐలు సుధాకర్, కృష్ణారావు,నరసింహారావు మరియు తదితరులు పాల్గొన్నారు.