19-02-2025 08:04:08 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారాంనగర్ కాలనీకి చెందిన మోర్తాల కళావతి(55) బుధవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త సీతారాం రెడ్డి, కుటుంబ సభ్యులు ఉదారత చూపుతూ డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. వారి సహకారంతో కళావతి నేత్రాలను దానం చేసి, మరొకరి జీవితంలో వెలుగు నింపారు. ఈ కార్యానికి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.